: శేఖర్ రెడ్డి వెనుక పారస్ మాల్ లోధా... రూ. 25 కోట్లు మార్చినందుకు అరెస్ట్


భారీగా అక్రమ ధనాన్ని పోగు చేసుకుని సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్న టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, తమిళనాడు వ్యాపారి శేఖర్ రెడ్డి కేసులో మరో పెద్ద చేపను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్ కతా కేంద్రంగా నిర్మాణ రంగం సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పారస్ మాల్ లోధా శేఖర్ రెడ్డికి పూర్తిగా సహకరించారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్ట్ చేశారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో విచారణలో భాగంగా పారస్ మాల్ పేరు బయటకు వచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయన రూ. 25 కోట్ల నోట్ల మార్పిడికి పాల్పడ్డాడని, ఆ డబ్బు శేఖర్ రెడ్డిదేనని గుర్తించామని అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News