: వాళ్ల పిల్లాడికి వాళ్లకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు... మీకేం నొప్పి?: రిషి కపూర్


బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లు తమ కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ పటౌడీ అనే పేరు పెట్టారు. దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. 14వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు పేరు పెట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై కరీనా కపూర్ బాబాయి, నటుడు రిషికపూర్ మండిపడ్డారు. వాళ్ల బిడ్డకు తైమూర్ అనే పేరు పెడితే మీకు బాధ ఏమిటని ప్రశ్నించారు. వారి పిల్లాడికి వారికి నచ్చిన పేరు పెట్టుకుంటారు... మీకు పుట్టిన పిల్లలకు వారు పేరు పెట్టలేదు కదా? అని ప్రశ్నించారు. అలెగ్జాండర్, సికందర్ లు ఆధ్యాత్మిక గురువులేం కాదు... అయినా, ఎంతో మంది వారి పేర్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. అనవసర కామెంట్లు చేయడం మానేసి... ఎవరి పనులు వారు చేసుకుంటే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News