: నేడు హైదరాబాద్ రానున్న భారత రాష్ట్రపతి ప్రణబ్


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు. బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఇక్కడకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

  • 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవానికి హాజరవుతారు.
  • 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 25న బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనానికి హాజరవుతారు.
  • 26న మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
  • 27న గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
  • 29న తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. ఆ తర్వాత మైసూరులో జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు.
  • 30న రాష్ట్రపతి నిలయంలో రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, ప్రభుత్వ ప్రతినిధులకు విందు ఇస్తారు.
  • 31వ తేదీన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

   

  • Loading...

More Telugu News