: ఔటర్ రింగ్ రోడ్డుపై కాలి బూడిదైన భారీ కంటెయినర్


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ భారీ కంటెయినర్ కాలి బూడిదైంది. పెద్దంబర్ పేట-తారామతి పేట మధ్యలో రింగురోడ్డుపై వెళుతుండగా... కంటెయినర్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కంటెయినర్ మొత్తం దగ్ధమైంది. ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దగ్ధమైన వాహనాన్ని కొన్ని రోజుల క్రితమే మలేషియా నుంచి తెప్పించారట. దీని ఖరీరు రూ. 2.5 కోట్లు అని బాధితులు తెలిపారు.  

  • Loading...

More Telugu News