: తెలంగాణపై పంజా విసిరిన చలిపులి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు


తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. దీని ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల మేర పడిపోయాయి. ఆదిలాబాద్‌లో అయితే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని పలుచోట్ల 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు ఉదయం ఎనిమిది గంటలు దాటినా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

  • Loading...

More Telugu News