: కేంద్రం నుంచి మరో తీపి కబురు.. 1000 రూపాయలకుపైగా జరిపే ఆన్‌లైన్ లావాదేవీలపై చార్జీలు రద్దు!
నోట్ల రద్దు తర్వాత పలుమార్లు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అటువంటి కబురే చెప్పింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలను ఆన్‌లైన్ లావాదేవీలవైపు మరల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోదీ సర్కారు అందులో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. తాజాగా ఖాతాదారులు వెయ్యి రూపాయలకుపైగా జరిపే ఆన్‌లైన్ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయరాదని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్‌టీపై ఎలాంటి చార్జీలు విధించవద్దని బ్యాంకులను ఆదేశించింది.