: ఐసిస్ దారుణం .. నలుగురిని తలకిందులుగా వేలాడదీసి మంటపెట్టి చంపిన ఉగ్రవాదులు
ఐసిస్ దారుణాలకు అంతులేకుండా పోతోంది. సిరియాలోని తమ అధీనంలో ఉన్న డెయిర్ ఎజర్ నగరంలో కుర్దులకు సాయం చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురు పౌరులను తలకిందులుగా వేలాడ దీసి కింద మంటలు పెట్టి దారుణంగా చంపేశారు. వందలాది మంది చూస్తుండగా ఈ దారుణం జరిగింది. కాగా, కుర్దు దళాలకు సాయం చేస్తున్నారనే ఆరోపణలపై కొన్ని రోజుల కిందట ఈ నలుగురిని ఇస్లామిక్ స్టేట్ పోలీసు విభాగం దివాన్ అల్ హిస్బ బంధించింది. ఐఎస్ ఉగ్రవాదులు తమ కోర్టులో వీరిని ప్రవేశపెట్టగా వారిని బహిరంగంగా వేలాడదీసి చంపివేయాలని ఆదేశించింది.