: మరోసారి విఫలమైన 'నిర్భయ్' క్షిపణి ప్రయోగం
సుదూరతీరాలకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంతో రూపొందించిన 'నిర్భయ్' క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగ కేంద్రం నుంచి దీనిని ప్రయోగించగా, నిర్దేశిత మార్గంలో అది ప్రయాణించలేదని అన్నారు. ఈ క్షిపణి ప్రయాగాన్ని నాలుగు సార్లు చేపట్టగా మూడు సార్లు విఫలమైంది. తొలిసారి మార్చి 2013లో 'నిర్భయ్' క్షిపణిని ప్రయోగించగా పూర్తిగా విఫలమైంది.
అక్టోబర్ 2014లో రెండోసారి ప్రయోగించగా అది విజయవంతం కాగా, శాస్త్రవేత్తలు నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులుగా 1,010 కి.మీ ప్రయాణించి, ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మళ్లీ అక్టోబర్ 2015లో మూడోసారి ప్రయోగించగా అది కూడా సత్ఫలితం ఇవ్వలేదు. తాజాగా ఈ రోజు నిర్వహించిన పరీక్ష కూడా విఫలమైంది.