: అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించాను: సమంత
'అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించా'నని దక్షిణాది ముద్దుగుమ్మ సమంత చెప్పింది. ‘ఫేస్ బుక్ వీడియో చాటింగ్’ లో ఈరోజు సాయంత్రం ఆమె అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఒక అభిమాని మాట్లాడుతూ, ‘తెరి’ చిత్రంలో అందరినీ ఏడిపించారు? అని ప్రశ్నించారు. దీనికి సమంత స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో నేను చనిపోతాను. ఆ సన్నివేశం చేసే ముందు దర్శకుడు అట్లీతో చాలా సేపు మాట్లాడాను. థియేటర్లో అందరినీ ఏడిపించేలా నా ప్రయత్నం చేస్తానని అట్లీకి చెప్పాను. ఆ సీన్ పండింది. ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాను. నేను చనిపోయే సన్నివేశం వచ్చినప్పుడు.. స్క్రీన్ వైపు చూడకుండా, థియేటర్లో పక్కన కూర్చున్న వారిని చూస్తూ కూర్చున్నా. చైతన్య కూడా నా పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ సీన్ లో అందర్నీ ఏడిపించాలనుకున్నా..ఏడిపించాను’ అని చెప్పింది సమంత నవ్వేస్తూ.