: అది వైఎస్ దుష్ప్రచారమేనంటోన్న టీడీపీ అధినేత
తాను రైతు వ్యతిరేకినంటూ సాగిన ప్రచారం వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగ అని తాను వ్యాఖ్యానించినట్టు పలు వేదికలపై రాజశేఖరరెడ్డి ప్రచారం చేశాడని బాబు తెలిపారు. తనను అప్రదిష్ట పాల్జేసేందుకే ఆయన అలా చేశాడని బాబు చెప్పారు. కానీ, తాను ఏనాడూ వ్యవసాయాన్ని కించపర్చలేదని బాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు.
తాను సృష్టించిన అపార సంపదను వైఎస్ హయాంలో దోచుకున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడంలో తనంతటి వాడు లేడని బాబు కితాబిచ్చుకున్నారు. ఇక లక్షల కోట్లు అక్రమంగా దోచుకున్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలకు తెలుసని బాబు వ్యాఖ్యానించారు.