: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే ఆలోచన లేదు: కేసీఆర్


నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చలో భాగంగా ఈ అంశంపై ఈరోజు ఆయన మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరినీ ప్రభుత్వం తీసుకుని,  ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామని, ప్రస్తుత పంటకు అవసరమయ్యే విధంగా ఫ్యాక్టరీని తయారుచేస్తామని రైతులకు చెప్పామని, అందుకు రైతులు ఆసక్తి చూపలేదని అన్నారు. ఈ విషయమై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. తమ మ్యానిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పలేదని, తెరిపించే ప్రయత్నం చేస్తామని మాత్రమే చెప్పామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని, దీంతో, రైతులు చెరకు పండించడం మానేశారని కేసీఆర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News