: కూకట్ పల్లిలో స్కూలు భవనంపై నుంచి కిందపడి బాలిక మృతి
హైదరాబాదు, కూకట్ పల్లిలోని రాఘవ స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందపడి మోనా అనే బాలిక మృతి చెందింది. స్కూల్ లో బ్రేక్ సమయంలో మోనా బిల్డింగ్ పైకి వెళ్లిందని స్కూలు యాజమాన్యం చెబుతోంది. దీనిపై బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ పిల్ల మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. మోనా తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.