: విజయ్ 'భైరవ' పాటలను ముందుగానే ఆన్ లైన్ లో విడుదల చేసి షాకిచ్చిన ఐట్యూన్స్!


తమిళ స్టార్‌ హీరో విజయ్‌, లేటెస్ట్ సెన్సేషన్ కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న ‘భైరవ’ చిత్రం ఆడియో ఆన్ లైన్ లో విడుదల చేసి చిత్రయూనిట్ కు ఐట్యూన్స్ సంస్థ షాకిచ్చింది. గతంలో ఈ ఆడియోను ఈ నెల 20న విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. అయితే, తర్వాత డేట్ మార్చుకుని, తమిళ పొంగల్‌ సందర్భంగా ఈ 23న విడుదల చేయనున్నట్టు తెలిపింది. అయితే, ఈ విషయం ఐట్యూన్స్ సంస్థకు తెలపలేదు. దీంతో ఆ సంస్థ నేడు తమ వెబ్ సైట్లో ఈ సినిమా ఆడియో పాటలను షెడ్యూల్ ప్రకారం ఉంచింది.

దీంతో నెటిజన్లు ఆ పాటలను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆడియో హక్కులు పొందిన అసలు సంస్థ లహరి మ్యూజిక్స్ వెంటనే అప్రమత్తమై, ఐట్యూన్స్ ను సంప్రదించి, ఆడియో వేడుక వాయిదా గురించి తెలపడంతో సైట్ నుంచి పాటలను తీసేసింది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వీటిని తీసుకురానున్నట్టు ప్రకటించింది. కేవలం 75 రూపాయలకే 20 నిమిషాల పాటలు అందుబాటులో ఉండడంతో తమిళ నెటిజన్లు డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News