: చిరంజీవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. అభిమానుల పాదయాత్ర
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ విజయవంతం కావాలని కోరుతూ ఆయన అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. అనంతపురంలోని చిరంజీవి అభిమానులు గుత్తి నుంచి గుంతకల్ లోని కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు, మరికొంత మంది అభిమానులు గుత్తి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కాగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.