: సల్మాన్, షారూఖ్ కోసం ప్రత్యేకంగా షో వేస్తా...ప్రేక్షకుల అభిప్రాయం కోసం టెన్షన్ తో ఎదురుచూస్తున్నా!: అమీర్ ఖాన్


ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, షారూఖ్ ఖాన్ ల కోసం 'దంగల్' సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తానని అమీర్ ఖాన్ తెలిపాడు. ముంబైలో 'దంగల్' ప్రీమియర్ వేసిన సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, 'దంగల్' సినిమా ప్రీమియర్ గురించి వారికి సమాచారమిచ్చానని, అయితే బిజీగా ఉండడంతో వారిద్దరూ హాజరు కాలేకపోయారని, వారిద్దరూ ఎప్పుడు ఫ్రీగా ఉంటే వారికి అప్పుడే 'దంగల్' చూపిస్తానని అన్నాడు.

కాగా, ఈ సినిమాను చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలంతా అమీర్ ఖాన్ పైన, అతనికి ఇద్దరు కుమార్తెలుగా నటించిన వారిపైన ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన వారంతా అభినందిస్తున్నారని, ప్రేక్షకుల అభిప్రాయం కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నానని అమీర్ ఖాన్ తెలిపాడు. కాగా, ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News