: మోదీ సహారా, బిర్లాల నుంచి లంచం తీసుకున్నారు: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు


ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా లంచం తీసుకున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గుజరాత్‌ లోని మెసానాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని సంచలన ప్రకటన చేశారు. కేవలం సహారా కంపెనీ మాత్రమే కాదని, బిర్లా కంపెనీ కూడా మోదీకి ముడుపులు ఇచ్చినట్టు చెప్పిందని ఆయన తెలిపారు. గతంలో ఇవే ఆరోపణలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన సంగతి తెలిసిందే.

పొతే, అవినీతికి వ్యతిరేకంగా మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలకు తాము సై అనలేమని అన్నారు. పేదలు బ్యాంకు రుణాలు చెల్లించకపోతే వారిని జైళ్లలో పెడుతున్నారని, వారి ఆస్తులు జప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. అదే బడాబాబుల రుణాలు రద్దు చేస్తున్నారని...ఇదేం విధానమని ఆయన ప్రశ్నించారు. రైతులు కొనుగోలు చేసే ఏ వస్తువుకూ చెక్కులు తీసుకోరని, అకౌంట్ల ద్వారా డబ్బులు చెల్లించరని ఆయన తెలిపారు. మోదీ నిర్ణయం వల్ల దేశ ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారని ఆయన మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News