: చంద్రబాబును ఎద్దేవా చేసిన బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్


అందరికంటే ముందు కొత్త నోట్ల రద్దు క్రిడిట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని అన్నారు. డిజిటలైజేషన్ కమిటీకి ఛైర్మన్ గా చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని, ప్రతి రోజూ రెండు గంటలు ఆ అంశం మీదే ఆయన పని చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేమో ఈ నిర్ణయం వల్ల బాధపడుతున్నానని అంటున్నారని ఆయన మండిపడ్డారు.

నోట్ల రద్దు ప్రారంభంలో అనుకూలంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా మారిపోవడంతో ఆయన గతంలోలానే ఉన్నారని అర్థమయిందని ఆయన చెప్పారు. చంద్రబాబు మారారని అనుకున్నామని ఆయన తెలిపారు. కాగా, గతంలో ఎన్నికల్లో ఓటమిపై బాబు మాట్లాడుతూ బీజేపీతో జత కట్టడం వల్లే ఓటమిపాలయ్యామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అనంతరం మోదీ హవాతో ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు మళ్లీ పుంజుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News