: ‘బ్రూక్ ఫీల్డ్’ తో భారీ డీల్ కుదుర్చుకున్న ‘రిలయన్స్’


రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్ ఫీల్డ్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మొబైల్ ఫోన్ టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు కెనడాకు చెందిన ‘బ్రూక్ ఫీల్డ్స్’ తో తప్పనిసరి ఒప్పందం (రెండు వైపులా బైండింగ్) కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా బ్రూక్ ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ.11,000 కోట్లను అందుకోనున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్ ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది.

  • Loading...

More Telugu News