: కళా వెంకట్రావుతో భేటీ అయిన వైకాపా ఎమ్మెల్యే కల్పన... ఫిరాయింపు ఖాయం!
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ ఉదయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కలిసిన కల్పన, పార్టీ మారే విషయమై చర్చలు జరిపారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె తన నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ మారే విషయమై అభిప్రాయాలను సేకరించిన సంగతి తెలిసిందే. మరో విడత కార్యకర్తలతో మాట్లాడి తాను ఎప్పుడు టీడీపీలో చేరుతానన్న విషయాన్ని వెల్లడిస్తానని కళా వెంకట్రావుకు కల్పన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఆమె చంద్రబాబుతో సమావేశం అవుతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, పామర్రు నియోజకవర్గంలో పేరుమోసిన తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఉండటంతో, ఇప్పుడు కల్పన చేరిక తరువాత పార్టీ సమీకరణాలు ఎలా ఉంటాయన్న విషయమై ఆసక్తి నెలకొంది.