: వేధింపులను ప్రశ్నించిన యువ దంపతులను చావగొట్టిన గూండాలు


సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించినందుకు, ఓ యువ దంపతులను చావగొట్టారు ఇద్దరు గూండాలు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మణిపురి జిల్లాలో జరిగింది. బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఓ చిరునామాను వెతుక్కుంటూ ఈ దంపతులు వెళ్లారు. రహదారిపై నడుస్తున్న వేళ, ఓ దుండగుడు వచ్చి యువతి దుప్పట్టాను లాగుతూ, అసభ్య చర్యలకు దిగాడు. దీన్ని చూసిన ఆమె భర్త వారించగా, ఇద్దరు వచ్చి వారిని కర్ర తీసుకుని కొట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనలో యువతి తలకు గాయాలయ్యాయి. మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడది వైరల్ అవుతోంది. దాడి చేసిన వారిలో ఒకతని పేరు ఆనంద్ యాదవ్ అని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News