: రూ. 50 లక్షల విలువైన మద్యం లోడుతో వెళుతున్న ట్రక్కు అదృశ్యం!


చిత్ర విచిత్రాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్ లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. ముజఫర్ నగర్ జిల్లా మన్సుపూర్ లోని షాషాదిలాల్ డిస్టిలరీ నుంచి రూ. 50 లక్షల విలువైన మద్యంతో బయలుదేరిన ట్రక్కు మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. డిసెంబర్ 15న ఈ ట్రక్కు ఆగ్రాకు బయలుదేరింది. అయితే ఆగ్రాకు చేరుకోకుండానే మధ్యలోనే మాయమైంది. అంతేకాదు, ట్రక్కు డ్రైవర్ హరిఓం కూడా అదే రోజు నుంచి కనిపించకుండా పోయాడు. రోజులు గడుస్తున్నా నిర్దేశించిన ప్రాంతానికి ట్రక్కు చేరకపోవడంతో... డిస్టిలరీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మద్యంతో డ్రైవర్ హరిఓం పరారయ్యాడా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News