: నోకియా కొత్త ఫోన్ ఫీచర్ల లీక్... సూపరంటున్న సోషల్ మీడియా


నాలుగైదేళ్ల క్రితం వరకూ సెల్ ఫోన్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి, ఆపై స్మార్ట్ ఫోన్ల రాకతో మిగతా కంపెనీలతో పోటీ పడలేక మార్కెట్ వాటాను కోల్పోయిన నోకియా, మరో హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఓ చైనా వెబ్ సైట్ నోకియా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్లివేనంటూ ఓ కథనాన్ని ప్రచురించగా, సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

5.5 అంగుళాల స్క్రీన్, 2కే క్యూహెచ్ డీ డిస్ ప్లే, జీసిస్ లెన్స్ తో 23 ఎంపీ కెమెరా, 6 జీబీ రామ్, స్నాప్ డ్రాగన్ 835 ఎస్ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ లతో పాటు మెటల్ యూనీబాడీ డిజైన్, వాటర్ ప్రూఫ్ సదుపాయాలుంటాయని తెలుస్తోంది. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 27న బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ ను తొలిసారిగా నోకియా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News