: 'శివ' సీక్వెల్ పై స్పష్టత ఇచ్చిన నాగార్జున!


దాదాపు పాతికేళ్ల నాటి సూపర్ హిట్ చిత్రం 'శివ' సీక్వెల్ పై హీరో నాగార్జున స్పష్టత ఇచ్చాడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రామ్ తాజా చిత్రం 'వంగవీటి' ప్రమోషన్ లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున 'శివ' సీక్వెల్ గురించి ప్రస్తావించారు.

"ఎంత మంది నా దగ్గరకు వచ్చారో... 'శివ' తీద్దామండీ... శివ-2 తీద్దామండీ మీతో అని... అందరూ సీక్వెల్స్ తీస్తున్నారని... రామూ... ఓన్లీ ఇఫ్ యూ మేకిట్ విత్ మీ... ఐ వాంట్ టూ డూ శివ-2. ఆర్ ఐ విల్ నెవర్ టచ్ దట్ (రామూ నువ్వు మాత్రమే నాతో తీయాలని ముందుకు వస్తే, నేను శివ-2 చేస్తాను. లేకుంటే దాన్ని ముట్టుకోనే ముట్టుకోను)" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News