: రామూ పెన్నుని కత్తిలా పట్టుకుని మీదకు వచ్చేసేవాడు.. నాకు భయం వేసేది..!: నాగార్జున


నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 'శివ టు వంగవీటి' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో అక్కినేని నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇద్దరూ కలసి ఓడ్కా తాగిన సందర్భాలను వేదికపై ఇతర సినీ ప్రముఖులతో పంచుకున్నారు.

"మేమిద్దరమూ ఓడ్కా తాగడం స్టార్ట్ చేసే వాళ్లం. ఒకటి అయిపొయ్యేది, రెండు అయిపొయ్యేది, ఫుల్ బాటిల్ అయిపొయ్యేది. నాకు భయం వేసేది. రామ్ కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కథ చెప్పేవాడు. పక్కనే ఉన్న పెన్ను, పెన్సిల్ ను కత్తిలా పట్టుకుని మీదకు వచ్చేసేవాడు. అందుకే టేబుల్ కు ఇటువైపున నేను కూర్చుని, అటువైపున రామ్ ను కూర్చోబెట్టేవాడిని" అంటూ 'అంతం' సినిమా స్టోరీ డిస్కషన్స్ ను గుర్తు చేసుకుంటూ నాగ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News