: చంద్రబాబు సాక్షిగా దేవినేనికి అవమానం.. సీఎంను కలవకుండా అడ్డుకున్న కమాండోలు
ఏపీ సీఎం చంద్రబాబు సాక్షిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అవమానం జరిగింది. సీఎంతో మాట్లాడేందుకు వెళ్తున్న మంత్రిని కమాండోలు అడ్డుకున్నారు. చివరికి తాను మంత్రిని బాబు అని మొత్తుకుంటే తప్ప ఆయన చంద్రబాబును కలవలేకపోయారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌కు హాజరైన మంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
అయితే చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న కమాండోలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో మంత్రి కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత సీఎంకు భద్రత పెంచిన సంగతి తెలిసిందే. ఈ సెక్యూరిటీ సిబ్బంది తరచూ మారుతుండడంతో మంత్రులెవరో, ఎమ్మెల్యేలు ఎవరో వారు గుర్తుపట్ట లేకపోతున్నారు. ఈ కారణంగా మంత్రి అయిన దేవినేనిని అడ్డుకున్నారు. అయితే తాను మంత్రిని అని చెప్పడంతో అప్పుడు పొరపాటును గుర్తించిన కమాండోలు స్వయంగా మంత్రిని సీఎం వద్దకు తీసుకెళ్లారు.