: మెక్సికోలోని బాణసంచా మార్కెట్లో భారీ పేలుడు.. 27 మంది సజీవ దహనం
మెక్సికోలోని బాణసంచా మార్కెట్లో జరిగిన భారీ పేలుడులో 26 మంది సజీవదహనమయ్యారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో సిటీకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న టుల్టెపెక్‌లోని శాన్ పాబ్లిటో ఫైర్‌వర్క్స్ మార్కెట్లో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మార్కెట్ పరిసరాలు భీతావహమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు ధ్వంసమయ్యాయి. సెప్టెంబరు 2005లో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కూడా ఇక్కడ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అప్పటి ఘటనలోనూ పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఉగ్రవాద చర్యా? లేకుంటే ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.