: పదవీకాలం ముగుస్తున్న వేళ... ఒబామా కీలక నిర్ణయాలు
వచ్చే నెలలో పదవి నుంచి దిగిపోతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 78 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 153 మందికి శిక్షను తగ్గిస్తూ గతంలో ఏ అధ్యక్షుడు చేయలేని పని చేశారు. క్షమాభిక్ష విషయంలో గతకొన్ని నెలలుగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఒబామా, తాజాగా 78 మందికి క్షమాభిక్ష ప్రసాదించారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. క్షమాభిక్ష పొందిన ఖైదీల్లో ఎక్కువమంది నకిలీ కరెన్సీ మార్పిడి, పేలుడు పదార్థాలతో దొరికిన వారు, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు ఉన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు 148 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టగా, 1176 మందికి శిక్ష తగ్గించారని వైట్‌హౌస్ న్యాయవాది ఒకరు వివరించారు.