: టీఆర్ఎస్ నేత ఇంట్లో కొత్త నోట్ల కట్టలు.. నగరంలో సంచలనం


టీఆర్ఎస్ కు చెందిన ఓ నేత ఇంట్లో కట్టల కొద్దీ కొత్త  నోట్లు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని విఠల్‌వాడీలో ఉంటున్న గాంధీనాయక్ ఇంట్లో ఈనెల 16న రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ. 40 లక్షల విలువైన కొత్త రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అలాగే ట్యాంక్‌బండ్ వద్ద ఓ వ్యక్తి నుంచి మరో రూ. 30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాదులోనే సోమవారం ఓ ఫైనాన్షియర్ ఇంట్లో రూ.1.3 లక్షలను సీజ్ చేసినట్టు తెలిపారు. మీర్‌పేటలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు, రెండు సెల్‌ఫోన్లు, 6 చెక్‌బుక్‌లు, 7 బ్యాంకు పాస్‌బుక్ లు, మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News