: నా హీరో రాంగోపాల్ వర్మ.. స్టార్ హీరోల పాప్యులర్ డైలాగులన్నీ ఆయనకే సూటవుతాయి !: హరీష్ శంకర్
ప్రతి ఒక్కరి జీవితానికి ఒక హీరో ఉంటారని, తన జీవితానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో అని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. 'శివ టు వంగవీటి' సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలను మించి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మేనని అన్నాడు. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు చెప్పిన పాప్యులర్ డైలాగులన్నీ వర్మకే సూటవుతాయని ఆయన తెలిపారు. 'నాక్కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది' తీసుకున్నా, ' ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' తీసుకున్నా, 'ముంబైలో ఎలాగోలా బతికేయాలని రాలేదు, ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను' .. ఇలా ఏ డైలాగ్ చెప్పినా అది ఆయనకే చెందుతుందని అన్నాడు.