: పవన్ కల్యాణ్ తో కలసి భోజనం చేసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: శివబాలాజీ


ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తో భోజనం చేసిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని నటుడు శివబాలాజీ తెలిపాడు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ తో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్టు చేసిన శివబాలాజీ 'కాటమరాయుడు' షూటింగ్ లో ఈ అనుభవం సొంతం చేసుకున్నానని అన్నాడు. ఈ ఫోటోలో పవన్ కల్యాణ్, శివబాలాజీతో పాటు, అజయ్, చైతన్య, కమల్ కామరాజు ఉన్నారు. పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అని, కొసరికొసరి వడ్డించారని శివబాలాజీ తెలిపాడు. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదని పేర్కొన్నాడు. తమిళంలో 2014లో విజయం సాధించిన 'వీరమ్' సినిమాకి రీమేక్ గా 'కాటమరాయుడు' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు ఈ నలుగురూ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News