: ‘టాటా గ్లోబల్ బేవరేజెస్’కు మరో డైరెక్టర్ రాజీనామా
టాటా గ్రూపులోని అతిపెద్ద సంస్థ అయిన టాటా గ్లోబల్ బేవరేజెస్ సంస్థకు మరో డైరెక్టర్ రాజీనామా చేశారు. ఈ సంస్థ స్వతంత్ర డైరెక్టర్, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ అనల్జిత్ సింగ్ ఈరోజు తన రాజీనామా సమర్పించారు. ఈ విషయమై టాటా గ్లోబల్ ఒక ప్రకటన చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి ఆయన రాజీనామా చేశారని, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా, టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సమయంలో, అది కరెక్టు కాదని వాదించిన డైరెక్టర్లలో అనల్జిత్ సింగ్ కూడా ఉన్నారు.