: బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు అస్వస్థత.. నానావతి ఆసుపత్రిలో చేరిక
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అస్వస్థతకు గురయ్యారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన్ని ముంబయిలోని నానావతి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఇన్ ఫెక్షన్ కారణంగా నిన్న ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనని డిశ్చార్జి చేస్తామని నానావతి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ఎండీ (మెడిసిన్) డాక్టర్ విశేష్ అగర్వాల్ చెప్పారు.