: కేంద్ర ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఇప్పుడే ప్రకటించనక్కర్లేదు: కేంద్ర ప్రభుత్వం
లోక్ పాల్ చట్టంలోని 44వ సెక్షన్ ప్రకారం కేంద్ర ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31 లోగా ప్రకటించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ చట్టంలో మార్పులు చేసి కొత్త నియమాలు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు ఎప్పుడు వెల్లడించాలో ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఈ చట్టం ప్రకారం ఉద్యోగులు తమ విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్, బంగారం, ఇన్సూరెన్స్ లకు సంబంధించిన వివరాలు, బాండ్లు, షేర్లకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉటుంది.