: ఆ పార్శిల్ ఎవరు పంపించారో నాకు తెలియట్లేదు: నటుడు సందీప్ కిషన్


యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. తాను ఏ వస్తువునూ ఆర్డర్ చేయకుండానే అతనికి ఒక పార్శిల్ వచ్చిందట. ఈ విషయాన్ని సందీప్ కిషన్ తన ట్వీట్ ద్వారా చెప్పాడు. ‘ ‘అమెజాన్’ డెలివరీ బాయ్ నాకు ఫోన్ చేసి ఒక పార్శిల్ వచ్చిందని, బయట ఎదురుచూస్తున్నానని చెప్పాడు. దీంతో, బయట వున్న నేను ఇంటికి వెళ్లాను. ఆ పార్శిల్ తీసుకున్న నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అసలు, నాకు పార్శిల్ చేసిన ఆ వ్యక్తికి నా అడ్రసు, ఫోన్ నంబరు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు’ అని ఆ ట్వీట్ లో సందీప్ కిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతకీ, ఆ పార్శిల్ లో ఏమున్నాయంటే.. మెర్రీక్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఒక గ్రీటింగ్ కార్డు, ఒక  షార్ట్ ఉన్నాయి.  ఆ పార్శిల్ కవర్ పై ‘ఫ్రం: సీక్రెట్ శాంటా’ అని రాసి ఉంది.
 

  • Loading...

More Telugu News