: మోదీ అసమర్థ నేత... ఒకే విషయంపై 59 నిర్ణయాలు తీసుకున్నారు: 'ఆప్' నేత అశుతోష్


ప్రధాని నరేంద్ర మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ బలహీనమయ్యారని అన్నారు. అందుకే ఆయన ప్రభుత్వం రోజుకో నిర్ణయం వెలువరిస్తోందని ఆరోపించారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన అనంతరం రోజుకో నిర్ణయంతో ప్రజలను ఆర్బీఐ గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు. డీమోనిటైజేషన్ నిర్ణయం తరువాత ఇప్పటి వరకు రద్దైన నోట్ల జమ, మార్పిడి నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం 59 ప్రకటనలు చేసిందని ఆయన తెలిపారు. ఒకే విషయంపై గతంలో ఏ ప్రధాని ఇన్ని నిర్ణయాలు, ప్రకటనలు చేయలేదని ఆయన తెలిపారు. డిసెంబర్ 30 వరకు పెద్దనోట్లను మార్చుకోవచ్చని, తొందరపడవద్దని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, ఇప్పుడు కేవలం 5000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయాలని చెబుతుండడం విడ్డూరమని ఆయన తెలిపారు. ఇది ప్రజను తప్పుదారి పట్టించి, వారిని మోసం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News