: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై కత్తితో దాడి


చెక్ రిపబ్లిక్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై దుండగుడు కత్తితో దాడి చేశాడు.ఈ దాడిలో ఆమె ఎడమ చేతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పెట్రా క్వోటావా తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ‘ఈరోజు ఉదయం మా నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. కత్తితో నాపై దాడికి పాల్పడ్డాడు. దుండగుడి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో నా ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. అదృష్టవశాత్తు బతికిబయటపడ్డాను’ అని ఆ పోస్ట్ లో క్విటోవా పేర్కొంది. కాగా, 2011, 2014లో క్విటోవా వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News