: కృతఙ్ఞతలు చెబుతూ శశికళ లేఖలు!
ఈ నెల 6న జయలలిత భౌతిక కాయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, నివాళులర్పించిన వారందరికీ జయలలిత నెచ్చెలి శశికళ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రధానంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఆమె లేఖలు రాశారు. వారు తనను ఓదార్చడంతో భావోద్వేగానికి గురయ్యానని ఈ నెల 18న రాసిన లేఖలలో ఆమె పేర్కొన్నారు. ఈ లేఖలను అన్నాడీఎంకే పార్టీ ఈరోజు విడుదల చేసింది. కాగా, జయలలిత మరణానంతరం ఆమె నెచ్చెలి శశికళకు పార్టీలోను, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం పెరుగుతున్న విషయం తెలిసిందే.