: ఆ రోజు సల్మాన్ కు నా ప్రేమను అర్పిస్తా!: 'సల్లూ' గాళ్ ఫ్రెండ్ లులియా వంతూర్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజున తన ప్రేమను, గౌరవాన్ని మొత్తం ఇచ్చేస్తానని అతని గర్ల్‌ ప్రెండ్‌ గా బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న ఉక్రెయిన్ భామ లులియా వంతుర్‌ తెలిపింది. ముంబైలో తాజాగా జరిగిన సాన్‌ సూయి స్టార్‌ డస్ట్‌ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, సల్మాన్ పుట్టిన రోజున మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఆ రోజు కుటుంబం మొత్తం అతని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటుందని చెప్పింది. కాగా, గతంలో భారత్ లో ఒక వ్యక్తితో బంధం పెంచుకోవాలంటే, అతని కుటుంబం మొత్తంతో గడపాలని, ప్రైవసీ ఉండదని ఈ భామ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వేడుకలో సల్మాన్ ముందే 'బాడీ గార్డ్' సినిమాలోని 'తేరీ మేరీ మేరీ తేరీ ప్రేమ్ కహానీ హే' పాటను పాడి అలరించింది. 

  • Loading...

More Telugu News