: మిషన్ భగీరథకు రూ. 42 వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు?: నిలదీసిన మల్లు


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై శాసనసభలో ఈ రోజు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, మిషన్ భగీరథకు రూ. 42 వేల కోట్లను కేటాయించారని... ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి తీసుకువస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కూడా రెండు నుంచి మూడు రెట్ల వరకు పెంచారని విమర్శించారు. అవసరం లేని చోట్ల కూడా కిలోమీటర్ల పొడవున పైప్ లైన్లను వేశారని మండిపడ్డారు. నీళ్ల కోసం పైపులు వేశారా? లేక పైపుల కోసం నీరు ఉండాలా? అనే విషయాన్ని ప్రభుత్వమే ఆలోచించుకోవాలని అన్నారు. భగీరథ టెండర్ల విధానమే సరిగా లేదని.. టెండర్లన్నింటినీ సభలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకే పథకం కోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేస్తే... రాష్ట్రం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News