: విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా!
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉంది. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నాడు. పిచ్ పై టర్న్ రాబట్టిన జడేజా వరుసగా వికెట్లు తీస్తూ దూసుకుపోతున్నాడు. అతనికి అమిత్ మిశ్రా జతకలిశాడు. అశ్విన్ ఫలితం రాబట్టలేని చోట వీరద్దరూ ఆకట్టుకోవడంతో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. భారత్ స్కోరు దాటాలంటే ఇంగ్లండ్ మరో 84 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ విజయం సాధించేందుకు మూడు వికెట్లు కావలసి వుంది. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 79 ఓవర్లలో 199 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో జడేజా ఐదు, మిశ్రా, ఇషాంత్ చెరో వికెట్ తీశారు.