: చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదు... ఆయనేం గాంధీ కాదు!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీనియర్ రాజకీయవేత్త, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని... దాని వెనుక చాలా మంది కష్టం ఉందని చెప్పారు. చంద్రబాబు అధికారులతో పాలిస్తున్నారని... అధికారుల రాజ్యం వద్దని ఆయనకు చాలా సార్లు చెప్పానని... ఆయన వినడం లేదని అన్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరగదని అందరూ భావించారని... అప్పటి పరిస్థితులను బట్టే తాను టీడీపీలో చేరానని దివాకర్ రెడ్డి చెప్పారు. పిలవగానే జనాలంతా వచ్చేయడానికి చంద్రబాబేమీ మహాత్మాగాంధీ కాదంటూ తమ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News