: ఐదో వికెట్ తీసిన టీమిండియా


చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. రవీంద్ర జడేజా అద్భుతమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలో ఐదో వికెట్ తీసి సత్తాచాటాడు. లంచ్ విరామానికి ముందు నాలుగో వికెట్ తీసిన భారత బౌలర్లను ఇబ్బంది పెడుతూ బెన్ స్టోక్స్ (22) మొయిన్ అలీ (44) చాలా సేపు క్రీజులో నిలిచారు. అనితరసాధ్యమైన డిఫెన్స్ తో బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడారు.

జడేజా వేసిన 70వ ఓవర్ రెండో బాల్ గాల్లోకి లేవగా పట్టుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడు. అనంతరం 72వ ఓవర్ రెండో బంతిని ఊరించేలా జడేజా సంధించాడు. దీంతో కాస్త టెంప్ట్ అయిన మొయిన్ అలీ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. ముందుకు వచ్చిన అశ్విన్ గాల్లోకి ఎగిరి వెనక్కి వంగుతూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. 73 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. జడేజా నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 

  • Loading...

More Telugu News