: 30 ఏళ్ల రికార్డును అందుకున్న స్పిన్ మాంత్రికుడు అశ్విన్
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న అశ్విన్... 30 ఏళ్లుగా ఎవరూ అందుకోలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 25 వికెట్లను పడగొట్టడమే కాకుండా... 250 పరుగులు చేశాడు. మూడు దశాబ్దాల తర్వాత ఓ ఆటగాడు ఈ రికార్డును అందుకోవడం ఇదే ప్రథమం. 1985లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఈ ఘనతను సాధించాడు. ఆ సంవత్సరం జరిగిన యాషెస్ సిరీస్ లో 250 పరుగులు చేయడమే కాక, 31 వికెట్లను బోథమ్ పడగొట్టాడు. ఆ తర్వాత మరెవరూ ఈ రికార్డును అందుకోలేకపోయారు. ఈ సిరీస్ లో అశ్విన్ ఇప్పటి వరకు 28 వికెట్లు తీయడమే కాక, 306 పరుగులు సాధించాడు.