: టాప్ ఆర్డర్ పోయింది... ఇంగ్లండ్ పై ఒత్తిడి పెరిగింది!
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరి టెస్టు చివరి రోజున 80 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుకోకుంటే ఓటమి తప్పదన్న స్థితిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టులో టాపార్డర్ విఫలమైంది. సగం ఆట కూడా పూర్తి కాకుండానే ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్ తో పాటు వన్ డౌన్ బ్యాట్స్ మెన్ రూట్, ఆపై బెయిర్ స్టో పెవీలియన్ దారి పట్టారు. రూట్ 6, బెయిర్ స్టో 1 పరుగు మాత్రమే చేయగలిగారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించే అవకాశాలు లేకపోవడంతో, ఆ జట్టు కనీసం డ్రా చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. భారత జట్టు విజయం సాధించాలంటే మరో 42 ఓవర్లలో ఆరు వికెట్లను తీయాల్సి వుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు.