: ప్రీమియర్ రైళ్లలో రిజర్వేషన్ పోగా, మిగిలిన ఖాళీ బెర్తులకు 10 శాతం డిస్కౌంట్... రైల్వే శాఖ కొత్త నిర్ణయాలు


రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియర్ రైళ్లలో ఖాళీగా మిగిలిపోతున్న బెర్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటంతో, నష్ట నివారణకు రైల్వే శాఖ కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, రిజర్వేషన్ చార్టులు తయారైన తరువాత, ఖాళీగా ఉండి బుక్ చేసుకునే టికెట్ల బేస్ ధరపై 10 శాతం రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్ లో భాగంగా ఆఖరి నిమిషంలో సైతం ప్రయాణికులను ఆకర్షించేలా, తద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

కాగా, ఈ రైళ్లలో డిమాండ్ ను బట్టి 10 నుంచి 50 శాతం వరకూ టికెట్ ధరలు పెరుగుతూ వెళతాయన్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లలో 70 శాతం టికెట్లు బుక్ అయిన తరువాత, ఎవ్వరూ బెర్తుల బుకింగ్ కు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 మధ్య రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 5,871 బెర్తులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ పరిస్థితిని దూరం చేేసేందుకే రిబేట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో తత్కాల్ టికెట్ల కోటాను 10 శాతానికి తగ్గించాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News