: చండీగఢ్ లో తిరుగులేదని నిరూపించుకున్న బీజేపీ!


చండీగఢ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ - అకాలీదళ్ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత 21 స్థానాలకు ఫలితాలు వెలువడగా, బీజేపీ - అకాలీదళ్ కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. వీటిల్లో బీజేపీ 16 స్థానాల్లో, అకాలీదళ్ ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ 3, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. మొత్తం 26 సీట్లున్న చండీగఢ్ మునిసిపాలిటీలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో బీజేపీకి ఈ గెలుపు ఎంతో బలాన్నిచ్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News