: ఎయిర్ ఇండియా కార్యాలయం 22వ అంతస్తులో మంటలు


దక్షిణ ముంబైలోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ 22వ అంతస్తులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో 22 అంతస్తుల్లో నిర్మితమైన భవంతిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలైనట్టు సమాచారం అందలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన అంచనాలు వేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News