: అత్యంత దారుణం... పాపను 15వ అంతస్తు నుంచి విసిరేసిన దుర్మార్గుడు


ముంబైలో అత్యంత పాశవిక ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అయిన ఐదేళ్ల చిన్నారిని 15వ అంతస్తు నుంచి ఓ మహిళ కిందకు విసిరేసింది. కక్షతోనే ఆమె ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది. ఈ దారుణ ఘటన ముంబైలోని బైకుల్లాలో ఉన్న న్యూ హింద్ మాదా కాలనీలో జరిగింది. కాలనీలోని 22 అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అశోక్, ఆర్తి అనే దంపతులు 15వ అంతస్తులో నివసిస్తున్నారు. ఆర్తి వర్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా, అశోక్ ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్నాడు.

నిన్న ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా, అశోక్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. గ్లోరియా ప్రీప్రైమరీ స్కూల్లో చదువుతున్న తమ చిన్నారి బయట ఆడుకుంటోంది. ఇంతలోనే సదరు మహిళ ఆ చిన్నారిని కిందకు విసిరేసింది. 15వ అంతస్తు నుంచి చిన్నారి కిందకు పడగానే... పెద్ద శబ్దం వచ్చింది. దీంతో, అక్కడకు వెళ్లి చూసిన వాచ్ మెన్ షాక్ కు గురయ్యాడు. హుటాహుటీన బాలికను ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... అంతకు ముందు ఆర్తితో ఓ మహిళ గొడవపడిందని... ఆమెనే ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. 

  • Loading...

More Telugu News