: 101 ఏళ్లు, 21 నేరాలు... 13 ఏళ్ల జైలు శిక్ష!


చేసిన పాపం ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా విడిచి పెట్టదనడానికి ఇది మరో ఉదాహరణ. దాదాపు 42 సంవత్సరాల క్రితం తాను చేసిన నేరాలకు ఓ శతాధిక వృద్ధుడికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది బ్రిటన్ కోర్టు. ప్రస్తుతం 101 ఏళ్ల వయసున్న రాల్ఫ్ క్లేర్క్ అనే వ్యక్తి 1974 నుంచి 1983 మధ్య ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయిపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. మొత్తం 21 అభియోగాలు ఇతనిపై నమోదయ్యాయి. ఇవన్నీ నిరూపితం కాగా, తాను వయో వృద్ధుడినని చెప్పుకోవడం మినహా రాల్ఫ్ మరే విధమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడంతో న్యాయమూర్తి రిచర్డ్ బాండ్ 13 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టు తీర్పిచ్చారు. నాలుగు దశాబ్దాల క్రితం చేసిన నేరమైనా, బాధితుల పట్టుదలతో నిందితుడు నేరస్థుడిగా నిరూపించబడ్డాడని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News