: చేతిలో మీల్స్ ప్లేటుతో క్యూలో నిలబడ్డ హరీశ్ రావు!
అసెంబ్లీలో వాడివేడి చర్చల అనంతరం, భోజన విరామ సమయాన తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్ రావు తన నిరాడంబరతను చాటుకున్నారు. మంత్రినన్న భేషజాలకు పోకుండా, మీడియా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల సహాయకులతో కలసి భోజనం చేశారు. అందరూ ప్లేట్లు పట్టుకుని క్యూలో నిలబడి వుంటే, తాను కూడా చేతిలో ప్లేటుతో క్యూలో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకూ వేచి, ఆపై స్వయంగా కూరలు వడ్డించుకుని భోజనానికి ఉపక్రమించారు. ఆయన్ను చూసిన మరో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వేముల ప్రశాంతరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సైతం ప్లేట్లతో వచ్చి లైన్లో చేరారు. ఈ ఆసక్తికర ఘటన నిన్న గ్యాంగ్ స్టర్ నయీమ్ పై చర్చ అనంతరం అసెంబ్లీ క్యాంటీన్ వద్ద చోటు చేసుకుంది.